fbpx
Thursday, April 25, 2024
HomeMovie News'ముత్తయ్య మురళీధరన్' గా 'విజయ్ సేతుపతి'

‘ముత్తయ్య మురళీధరన్’ గా ‘విజయ్ సేతుపతి’

VijaySethupathi As MuthaiahMuralidharan

కోలీవుడ్: ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా రియల్ ఇన్సిడెంట్స్, స్పోర్ట్స్ మూవీస్, బయో పిక్ మూవీస్ ల హవా నడుస్తుంది. శ్రీలంక అందించిన గొప్ప క్రికెటర్ లలో ఒకరైన ముత్తయ్య మురళీధరన్ పైన సినిమా చేస్తున్నట్టు చాలా రోజులనుండి వార్తలు వస్తున్నాయి. వీటిని కన్ఫర్మ్ చేస్తూ ఇవాళ ఒక ప్రకటన విడుదలైంది. ముత్తయ్య మురళీధరన్ బయో పిక్ లో తమిళ్ టాప్ పెరఫార్మెర్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇది ఒక స్పోర్ట్స్ బయోపిక్. తన స్పిన్ మాయాజాలం తో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ మురళీధరన్. మురళి ధరన్ లైఫ్ లో మామూలు జనాలకి తెలియని కోణాల్ని చూపించబోయే ప్రయత్నం లో ఈ మూవీ మేకర్స్ ఉన్నారు.

విజయ్ సేతుపతి టైటిల్ రోల్ లో చేస్తున్న ఈ సినిమాని ‘మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్’, ‘దార్ మోషన్ పిక్చర్స్’ కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎమ్.ఎస్. శ్రీపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలంక ఇంటర్నేషనల్ క్రికెట్ లో దాదాపు 22 సంవత్సరాలు సేవలు అందించిన ఘనత మురళీధరన్ ది. టెస్టుల్లో , వన్డేల్లో కలిపి 1300 పై చిలుకు వికెట్లు సాధించిన రెకార్డ్ ఆయన సొంతం. 2011 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కి వీడ్కోలు పలికి తర్వాత కొన్ని టోర్నీల్లో టీ 20 క్రికెట్ ఆడి ఇపుడు ఐపీల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కి బౌలింగ్ కోచ్ గా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular