fbpx
HomeMovie Newsమరో పాన్ ఇండియా మూవీ తో వస్తున్న గుణ శేఖర్

మరో పాన్ ఇండియా మూవీ తో వస్తున్న గుణ శేఖర్

Gunashakar Shakuntalam Announcement

టాలీవుడ్: రానా హీరో పాత్రలో సురేష్ ప్రొడక్షన్స్ వారితో గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయం లో దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ముగిసిపోయినట్టు ప్రకటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి ఇంకా సమయం పట్టేట్టు ఉండడం తో ఈ మధ్యలో మరొక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు గుణ శేఖర్. దీనికి సంబందించిన ఒక ప్రకటన ఇవాళ చేసాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

”శాకుంతలం” అనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ‘వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను” అని ట్వీట్ చేసాడు గుణ శేఖర్. అంతేకాకుండా ”శాకుంతలం” మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ’ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే సినిమా టైటిల్ కేవలం ఇంగ్లీష్ లోనే రిలీజ్ చేయడం గమనార్హం. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణ శేఖర్ , మణి శర్మ కాంబినేషన్ గురించి తెలిసిన విషయమే. వీళ్ళ కాంబో లో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ద్వారా మరోసారి వీళ్ళు కలిసి పని చేయబోతున్నారు. ఈ కమర్షియల్ సినిమాల సందడిలో వరుసగా పౌరాణిక సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్న గుణ శేఖర్ ని అందరూ అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular