fbpx
HomeMovie Newsమరోసారి వాయిదా పడ్డ జేమ్స్ బాండ్ సినిమా

మరోసారి వాయిదా పడ్డ జేమ్స్ బాండ్ సినిమా

JamesBond NoTimeToDie MoviePostPonedAgain

హాలీవుడ్: హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సిరీస్ లో వచ్చే సినిమాలకి ఉన్న క్రేజ్ తెలిసిన విషయమే. ఈ సినిమాలలో ఉండే యాక్షన్ సెక్వెన్సెస్ కి ప్రపంచం అంతటా అభిమానులు ఉన్నారు. ఇప్పటికి ఈ సిరీస్ లో 24 సినిమాలు విడుదల అయ్యాయి. ప్రస్తుతం జేమ్స్ బాండ్ 25 వ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందించబడింది. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా అనే అవాంతరం వల్ల ఇప్పటికే ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఇపుడు ఈ సినిమాని 2021 ఏప్రిల్ కి వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు.

జేమ్స్ బాండ్ హీరో డానియల్ క్రైగ్ నటిస్తున్న జేమ్స్ బాండ్ 25 వ చిత్రం ‘నో టైమ్ టు డై’ చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్ అంత ముగించుకొని ఈ సంవత్సరం ద్వితీయార్థం లో విడుదల అవ్వాల్సింది. ఎంజీఎం యూనివర్సల్, ఎంజిఎం బ్యానర్లపై మైఖేల్ జి విల్సన్, బార్బరా బ్రోకలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఆలస్యం అభిమానులకు నిరాశ కలిగించిందని మేం అర్థం చేసుకున్నాము. కాని ఇప్పుడు వచ్చే ఏడాది రిస్క్ లేని సమయం ఎంచుకుంటున్నాం అని మేకర్స్ తెలిపారు. నిన్న బిల్లీ ఎలిష్ పాడిన ‘జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్’ విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు మార్చిలో మూసివేసాక.. న్యూయార్క్ నగరంలో ఇప్పటికీ థియేటర్లు తెరవలేదు. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలీదు. లాస్ ఏంజిల్స్లోని సినిమా థియేటర్లు మూతపడ్డాయి మరికొన్ని వారాల్లో తెరవడానికి అనుమతి పొందవచ్చు. కానీ ప్రపంచమంతటా విస్తరించిన ఆరోగ్య సంక్షోభం వాళ్ళ ఈ సినిమాని విడుదలని మరోసారి వాయిదా వేస్తున్నట్టు సినిమా టీం ప్రకటించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular