fbpx
Saturday, April 20, 2024

INDIA COVID-19 Statistics

44,998,565
Confirmed Cases
Updated on September 26, 2023 9:12 pm
531,930
Deaths
Updated on September 26, 2023 9:12 pm
557
ACTIVE CASES
Updated on September 26, 2023 9:12 pm
44,466,078
Recovered
Updated on September 26, 2023 9:12 pm
HomeMovie Newsఅక్టోబర్ 22 న 'రామరాజు ఫర్ భీం'

అక్టోబర్ 22 న ‘రామరాజు ఫర్ భీం’

RamarajuForBheem TeaserFromRRR onOctober22

హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘RRR’. ఈ సినిమా నుండి వచ్చే అప్డేట్ కోసం జనాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా తర్వాత నిన్నటి నుండి పునః ప్రారంభం అయింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేసారు సినిమా టీం. ఈ వీడియో కూడా ఒక సినిమా టీజర్ లెవెల్ కి ఏం తక్కువ లేదు అని చెప్పవచ్చు.

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘భీం ఫర్ రామరాజు’ అనే పేరుతో రామ్ చరణ్ క్యారెక్టర్ (అల్లూరి సీతారామరాజు) కి సంబందించిన టీజర్ ఎన్టీఆర్ బాగ్ గ్రౌండ్ వాయిస్ తో వచ్చి అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అయితే అప్పటికే లాక్ డౌన్ ఉండడం వలన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఎన్టీఆర్ పాత్రకి సంబందించిన టీజర్ విడుదల చేయలేకపోయారు మేకర్స్. ఇపుడు షూటింగ్ మొదలు పెట్టగానే దానికి సంబందించిన అప్డేట్ ఇచారు రాజమౌళి. ఈనెల 22 న ఎన్టీఆర్ కి సంబందించిన టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనిపై రామ్ చరణ్ కూడా స్పందిస్తూ ‘రామరాజు ఫర్ భీం’ అత్యంత అద్భుతంగా ఉంటుందని .. నేను నీకిచ్చే అద్భుతమైన బహుమానం అని ట్వీట్ చేసి అంచనాలని ఎక్కడికో తీసుకెళ్లాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం అవుతున్న ఈ సినిమాని ప్రస్తుతం రెండు నెలల నిరవధిక షెడ్యూల్ ముగిసిన తర్వాత పరిస్థితి ని బట్టి విడుదల తేదీ ని ప్రకటిస్తామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular