fbpx
HomeMovie Newsరిపీట్ అవ్వబోతున్న గబ్బర్ సింగ్ కాంబో

రిపీట్ అవ్వబోతున్న గబ్బర్ సింగ్ కాంబో

BandlaGanesh MovieWith PowerstarPawankalyan

హైదరాబాద్: ఇదివరకే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబో ప్రకటించారు కదా మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా.. ఈ సారి ప్రొడ్యూసర్ , హీరో కాంబినేషన్ కూడా రిపీట్ అవబోతోంది. బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవబోతోంది. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలుపెట్టినప్పటినుండి పవన్ తో సినిమా తియ్యడానికి చాలానే ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు పవన్ ని ఒప్పించి పవర్ స్టార్ తో సినిమా తియ్యడానికి సిద్ధం అయ్యాడు. కానీ ఇది ఏ సినిమాకి అనేది ఇంకా చెప్పలేదు. ఇప్పటికే పవన్ లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఎదో ఒక దానికి అనేలా కూడా లేకుండా అన్ని సినిమాలకి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మరి వాటన్నిటి తర్వాత బండ్ల గణేష్ సినిమా అంటే దానికి ఇంకా చాలానే సమయం పడ్తది. ఈలోపు ఎన్నికలు వస్తే పవన్ నిర్ణయం ఎలా ఉంటుందనేదని కూడా తెలియని విషయం.

బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ “నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు. దీనికి పవన్ కల్యాణ్ తో దిగిన లేటెస్ట్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబో లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. వీళ్ళ కాంబో లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్ అయింది, ‘తీన్మార్’ పర్వాలేదనిపించింది. ఇన్ని రోజులు నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్ మళ్ళీ పవన్ సినిమాతో గట్టిగా హిట్ కొడదామనుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular