fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsకాంబినేషన్ రిపీట్ చేస్తున్న యువ హీరో

కాంబినేషన్ రిపీట్ చేస్తున్న యువ హీరో

Rajtarun AnotherMovieWith VijayKumarKonda

హైదరాబాద్: గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం లాంటి సినిమాలు తీసి చాలా గ్యాప్ తర్వాత యువ హీరో రాజ్ తరుణ్ తో ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే సినిమా తీసాడు డైరెక్టర్ ‘విజయ్ కుమార్ కొండా’. ఈ సినిమా గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 నుండి ఆహ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది. అయితే ఈ సినిమా రిసల్ట్ రాకముందే ఆ డైరెక్టర్ తో మరో సినిమా ప్రారంభించాడు రాజ్ తరుణ్. వీరి కాంబో లో శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలీ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం 1 గా మహీధర్ , దేవేష్ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందబోతోంది. విజయ్ ఇదివరటి సినిమాల్లాగా ఫామిలీ, లవ్ స్టోరీ కాకుండా ఇది ఒక థ్రిల్లర్ సినిమా అని చెప్పారు.

ఈ సినిమాకి నంద్యాల రవి కథ, మాటలు అందిస్తున్నాడు, ఆండ్రు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు హేమల్ ఇంగ్లే, మధు నందన్, అజయ్, కోట శ్రీనివాసరావు, పూర్ణ, జబర్దస్త్ వేణు , అప్పాజీ, రవి వర్మ, రాజా రవీంద్ర కూడా నటించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular