fbpx
Monday, April 29, 2024
HomeMovie Newsఆదిపురుష్ లో 'లంకేష్' గా సైఫ్

ఆదిపురుష్ లో ‘లంకేష్’ గా సైఫ్

SaiAliKhan AsLankeshIn Aadipurush

హైదరాబాద్: ఈ మధ్య ప్రభాస్ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నాడు. తన సినిమా అప్ డేట్స్ కూడా ఒక దాని తర్వాత ఒకటి వదులుతున్నాడు. ఇవాళ తాను తియ్యబోతున్న ఆదిపురుష్ సినిమా నుండి మరొక అప్డేట్ విడుదల చేసారు. ఈ సినిమాలో రామునిగా ప్రభాస్ నటించబోతున్నాడు. రామునికి విలన్ గా లంకేశ్ రోల్ లో ‘సైఫ్ అలీ ఖాన్’ నటించబోతున్నట్టు ఈ సినిమా టీం ఈరోజు ప్రకటించారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ రాముడు అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇక నేడు రావణుడు ఎవరు అనే విషయంలోనూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

మామూలుగా ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ చాలా లేట్ గా వస్తాయి కానీ ఆదిపురుష్ విషయంలో సినిమా మేకర్స్ దూకుడుగా ఉన్నారు. సినిమా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే రావణుడు ఎవరు అనే విషయం లో ఒక నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించారు. ముందు నుండి సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా చేయబోతున్నాడు అనే రూమర్స్ ఇప్పుడు నిజమయ్యాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగింది. సాహో సినిమా కూడా ఇక్కడ అంత ఆడనప్పటికీ బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular