fbpx
HomeMovie Newsఅనుకోకుండా చిరు సినిమాని ప్రకటించిన పవన్

అనుకోకుండా చిరు సినిమాని ప్రకటించిన పవన్

PawanKalyan UnofficiallyAnnounced ChiranjeeviNextMovie

టాలీవుడ్: నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసారు. ఇది ఎప్పుడూ జరిగేదే, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి రిటర్న్ లో థాంక్స్ చెబుతూ వాళ్ళ గురించి, వాళ్ళు ఇంతకముందు చేసిన సినిమా గురించి, ముందు చేయబోయే సినిమా గురించి విషెస్ తెలిపారు. ఇదే క్రమం లో మెహర్ రమేష్ కూడా పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలిపినపుడు రిటర్న్ లో థాంక్స్ చెబుతూ తర్వాత తియ్యబోయే చిరంజీవి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు పవన్. దీంతో అనధికారికంగా చిరంజీవి, మెహర్ రమేష్ సినిమా విషయాన్ని ప్రకటించినట్టయింది.

ఇటీవల చిరంజీవి ‘ఆచార్య’ టైటిల్ ను పొరపాటున ఇలాగే ప్రకటించారు.పవన్ కూడా చిరు, మెహర్ రమేష్ ల మూవీ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. అయితే ‘డౌట్ ఏ లేదు అందరికి రిప్లై లు ఇచ్చినపుడే అర్ధం అయింది తమ్ముడి ఫోన్ అన్నయ్య దగ్గర ఉన్నట్టుంది’ అని సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ కనపడుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను తర్వాత లూసిఫెర్ రీమేక్ అని , త్రివిక్రమ్ తో ఒక సినిమా అని రూమర్స్ ఉన్నాయ్, మెహర్ రమేష్ సినిమా కూడా రూమర్ గా వచ్చినప్పటికీ ఈ ట్వీట్ తో అది కన్ఫర్మ్ అయినట్టే అని అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular