fbpx
HomeTelanganaచట్టం ముందు దేవుడు కూడా ఒక్కటే: హై కోర్టు

చట్టం ముందు దేవుడు కూడా ఒక్కటే: హై కోర్టు

GOD-IS-SAME-BEFORE-JUSTICE

ఖమ్మం : దేవుడి పేరు చెప్పి భూములను ఆక్రమించరాదని, దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఖమ్మంలోని టీటీడీ కళ్యాణ మండపం భూవివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషట్ ప్రధాన కార్యదర్శి అల్లిక అంజయ్య దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని విచారణ సందర్భంగా పిటిషనర్ పేర్కొనగా, టీటీడీ ఆధీనంలో 12 గుంటలు అదనంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే టీటీడీ పక్క భూమిని కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని ఖమ్మం కార్పొరేషన్ హైకోర్టుకు తెలిపింది.

ఈ విషయంపై హైకోర్టు స్పందిస్తూ, ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, భూమి వెనక్కి తీసుకోగా టీటీడీ ఎందుకు స్పందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వెనుక టీటీడీ ఉండొచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమినే టీటీడీ ఆక్రమించినట్లు కనిపిస్తోందని, భూమికి సంబంధించిన దస్త్రాలు, పటాలన్నీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్‌ 8వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular