fbpx
HomeAndhra Pradeshప్రతి ఒక్కరికి విజన్ ఉండాలి: సీఎం జగన్

ప్రతి ఒక్కరికి విజన్ ఉండాలి: సీఎం జగన్

OFFICERS-SHOULD-HAVE-VISION-IN-DEVELOPMENT

అమరావతి: అరకొర ఆలోచనలు చేయవద్దని, దార్శనికతతోనే సమూల పరిష్కారాలు దొరుకుతాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి విజన్‌ ఉండాలని, పెద్ద ఆలోచనలతోనే మార్పులు సాధ్యపడతాయన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, స్కూళ్లలో నాడు-నేడు, ప్రజారోగ్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అలానే వచ్చాయని చెప్పారు. గురువారం పశు సంవర్థక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘ చేపలు, రొయ్యలు పండిస్తున్న రైతులకు కనీస గిట్టుబాటు ధరలు రావాలి. మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలి. ప్రీ ప్రైమరీ ప్రాసెసింగ్‌ నుంచి సెకండరీ ప్రాసెసింగ్‌ వరకూ, ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్‌, కోల్డ్‌ స్టోరేజీల సదుపాయాలు కల్పించాలి. వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలి. దీని వల్ల ప్రైవేట్‌ వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసా ఇవ్వగలుగుతాం. సుమారు 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, దళారుల నుంచి పొగాకు రైతులను కాపాడగలిగాం. ఆక్వా ఉత్పత్తుల విషయంలోనూ ధరల స్థిరీకరణ అమలు చేసేలా ఆలోచనలు చేయాలి. వైఎస్సార్‌ చేయూత కింద పాడి పశువుల కొనుగోలులో అమూల్‌ సలహాలు తీసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular