fbpx
HomeMovie Newsఓటీటీ లో విడుదల అవ్వబోతున్న మరో పెద్ద హీరో సినిమా

ఓటీటీ లో విడుదల అవ్వబోతున్న మరో పెద్ద హీరో సినిమా

Surya AaakashameHaddura ReleasingOnPrime

కోలీవుడ్: తమిళ స్టార్ హీరో ‘సూర్య’ , తమిళ్ లో కమల్ హాసన్ తర్వాత పాత్రల ద్వారా కథల ద్వారా ఎక్కువ ప్రయోగాలు చేస్తాడు అన్న పేరున్న హీరో. అలాగే ఆయన నటనకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. రజిని కాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగు లో అంత క్రేజ్ ఉన్న తమిళ్ హీరో కూడా సూర్య నే. సూర్య ప్రస్తుతం నటించి విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమా ‘సూరారైపోట్రు’, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు ‘కెప్టెన్ జి ఆర్ గోపినాథ్’ కథ ఆధారంగా తెరకెక్కించారు అని ఒక టాక్ ఉంది. ‘గురు’ సినిమా దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ సినిమాకి దర్శకురాలు.

ఇప్పటికి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ బాగానే ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచానాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ సంవత్సరం వేసవి లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల విడుదల ఆగిపోయింది. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 30 న విడుదల చేయబోతోంది ఈ సినిమా టీం. ఇప్పుడే థియేటర్ లు తెరుచుకునే సూచనలు కనపడకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సూర్య తెలిపారు. అలాగే థియేటర్ లు తెరుచుకునే పరిస్థితి వచ్చే సరికి వరుసగా ఎక్కువ సినిమాలు చేస్తాను అని మాట ఇచ్చాడు సూర్య. మొన్ననే నాని ‘ V ‘ ఇపుడు సూర్య ‘ఆకాశం నీ హద్దురా’. ఇంకా ఓటీటీల్లో వీటి ఫలితం చూసాక ఇంకా చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టేట్టు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular