fbpx
Saturday, September 7, 2024
HomeMovie News'డాక్టర్' మూవీ సెకండ్ సింగిల్ విడుదల

‘డాక్టర్’ మూవీ సెకండ్ సింగిల్ విడుదల

SecondSingleReleasedFrom Sivakarthikan Doctor

కోలీవుడ్: తమిళ్ లో మీడియం రేంజ్ హీరో శివ కార్తికేయన్. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లో కోచి చిన్న చిన్న హిట్స్ కొడుతూ ఇపుడు పెద్ద స్టార్ గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సినిమా ‘డాక్టర్’. ఇందులో హీరో కి జోడి గా నాని గ్యాంగ్ లీడర్ లో నటించిన ‘ప్రియాంక అరుళ్ మోహన్’ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి తమిళ్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమానుండి విడుదలైన ‘చెల్లెమ్మ’ పాట విడుదలైనప్పటినుండి చార్ట్ బస్టర్ లిస్ట్ లో టాప్ లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి రెండవ పాట విడుదల చేసారు.

‘నెంజమే’ అంటూ సాగే ఈ పాట మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. అనిరుద్ సంగీతం తో పాటు ఈ పాట పిక్చరైసేషన్ ఆకట్టుకుంటుంది. ఈ పాట మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమింగ్ లో బీచ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త దనంగా అనిపిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శివకార్తికేయన్ స్వయంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular