fbpx
HomeMovie Newsమెగాస్టార్ 'ఆచార్య' ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ విడుదల

MegastarChiranjeevi Acharya Firstlook

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో 152 వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. కొరటాల శివ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిచి పోయింది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ చిరంజీవి మణిశర్మ మ్యూజిక్ కాంబో రిపీట్ అవబోతుంది.

కొరటాల శివ అంటేనే కమర్షియల్ సినిమాతో సందేశాత్మకంగా తియ్యడం అతని ప్రత్యేకత. ఈ సినిమా పోస్టర్ ని చూస్తే కూడా డే తెలుస్తుంది. ఈ పోస్టర్ లో చేతిలో కత్తి పట్టుకొని ఉన్న చిరంజీవి బ్యాక్ సైడ్ లుక్ చూపించారు. ‘ధర్మస్థలి’ అనే అంశాన్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ మోషన్ పోస్టర్ చూస్తే ముందు నుంచి చెప్తున్నట్లు మంచి సందేశంతో ఈ మూవీ ఉండబోతోందని అర్థం అవుతోంది. దీనికి మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది.ఆచార్య’ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ”ధర్మం కోసం ఒక కామ్రేడ్ అన్వేషణ” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular