fbpx
HomeMovie Newsట్రెండ్ అవుతున్న శృతి హాసన్ 'ఎడ్జ్'

ట్రెండ్ అవుతున్న శృతి హాసన్ ‘ఎడ్జ్’

ShrutiHasan Edge TrackReleased

కోలీవుడ్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి తన మల్టీ టాలెంట్ తో తండ్రి కి తగ్గ తనయ గా పేరు తెచ్చుకుంది శృతి హాసన్. శృతి హాసన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నటిగా, సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. గత కొద్దీ రోజులుగా సినిమాలు తగ్గించి పూర్తి సమయం మ్యూజిక్ కే కేటాయించింది. లండన్ లో చాలా మ్యూజికల్ షోస్ చేసింది. అయితే శృతి హాసన్ తన యు ట్యూబ్ ఛానల్ ద్వారా తాను కంపోజ్ చేసిన మొదటి పాటని అప్లోడ్ చేసింది. ‘ఎడ్జ్’ అనే టైటిల్ తో తానే పాడుతూ మ్యూజిక్ ప్లే చేస్తున్న వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఈ పాట రాసింది కూడా శృతి హాసన్ అవడం ఇంకో విశేషం

ప్రస్తుతం ఈ పాటకి చాలా మంది అభిమానులే కాకుండా తనతో పాటు నటించిన నటులు మరియు సంగీత దర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు కూడా నీ మొదటి కంపోసిషన్ చాలా బాగుంది ఇంకా చాలా చెయ్యాలి అని మెచ్చుకున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అయితే ‘రచన, సంగీతం, వీడియో’ అన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఇలాంటివి చాలా రావాలని అవి చూడడానికి వెయిటింగ్ అని ట్వీట్ చేసారు. ఇంకా థమన్ అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉందని మెచ్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular