fbpx
HomeMovie Newsఇండియన్ 2 ఆక్సిడెంట్ బాధితులకి నష్ట పరిహారం

ఇండియన్ 2 ఆక్సిడెంట్ బాధితులకి నష్ట పరిహారం

ExgraciaFor Indian2Shooting VictimsFamilies

కోలీవుడ్ : 1996 సంవత్సరంలో విడుదలై అద్భుత విజయం సాధించిన సినిమా భారతీయుడు. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసారు. ఈ సినిమాకి సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే 2019 లో ఈ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 అనే సినిమా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభించినప్పటినుండి ఎదో రకంగా ఆటంకాలు వచ్చి ఈ సినిమా షూటింగ్ ఆగుతూ వస్తుంది. మామూలుగానే శంకర్ సినిమాలు చాలా ఆలస్యం ఐతుంటాయి, ఈ కారణాల వలన ఇంకా ఆలస్యం అవుతుంది.

మొదలు కమల్ హాసన్ డేట్స్ వల్ల, తర్వాత ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ కి వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల కొద్దీ రోజులు బ్రేక్ పడింది. ఆ తర్వాత షూటింగ్ లో జరిగిన ఒక క్రేన్ యాక్సిడెంట్ వలన చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. దాదాపు చాలా మంది సినిమా యూనిట్ పెద్ద ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో కొంత మంది షూటింగ్ సిబ్బంది మరణించారు, కొంత మందికి గాయాలయ్యాయి.

ఈ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ మరియు హీరో కమల్ హాసన్ లు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది.కమల్ ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం అందించగా నిర్మాణ సంస్థ లైకా నుండి ఒక్కొక్కరికి రెండు కోట్ల చొప్పున పరిహారం ను అందించారు. బాధిత కుటుంబాలకు స్వయంగా కమల్ మరియు శంకర్ లు కలిసి ఈ మొత్తం ను అందించారు. ఇన్ని రోజులు షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా పరిస్థితులు మెరుగు పడగానే మళ్ళీ పునః ప్రారంభించే ఆలోచన లో ఉన్నారు నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular