fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsఈ వారం రిలీజెస్

ఈ వారం రిలీజెస్

Movie Releases ThisWeek

టాలీవుడ్: ప్రతి వారం థియేటర్ లలో సినిమాల విడుదల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి. ఇన్ని రోజులు చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ లు అయ్యాయి. మెల్లి మెల్లిగా మీడియం రేంజ్ హీరోలు కూడా సినిమాలని విడుదల చేస్తున్నారు. ఈ వారం రెండు గుర్తింపు ఉన్న నటుల సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటితో పాటు కొన్ని చిన్న సినిమాలు , ఓటీటీ రిలీజ్ లు కూడా ఉన్నాయ్.

ఈ వారం విడుదల అయ్యే సినిమాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్ ‘ సినిమాకి మంచి బజ్ ఉంది. పలాస 1978 లాంటి రియలిస్టిక్ సినిమాని డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో సుధీర్ బాబు నటన కూడా ఆకట్టుకోనుందని ట్రైలర్స్, టీజర్స్ ద్వారా తెలుస్తుంది. సుధీర్ బాబు, ఆనంది మధ్యన లవ్, ఎమోషన్స్ , యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చూపించనున్నట్టు అర్ధం అవుతుంది. మణి శర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానుంది.

ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో బజ్ ఉన్న మరో సినిమా ‘ఇచట వాహనములు నిలపరాదు‘. అక్కినేని హీరో సుశాంత్ హీరో గా , నూతన దర్శకుడు ఎస్.దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, ప్రియ దర్శి, అభినవ్ గోమఠం, వెంకట్ మరిన్ని పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఒక రొమాంటిక్ మరియు థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. ట్రైలర్ సినిమా పైన ఆసక్తి కలిగేలా చేసింది. ఈ సినిమాతో సుశాంత్ మరో హిట్ కొడతాడని చాలా నమ్మకంగా ఉన్నాడు.

వీటితో పాటు కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలో ‘హౌస్ అరెస్ట్’ అనే పిల్లల సినిమా, సూర్యాస్తమయం అనే మరొక సినిమా విడుదల అవుతున్నాయి. అలాగే కమెడియన్ సత్య హీరో గా, సందీప్ కిషన్ నిర్మాణంలో రూపొందిన ‘వివాహ భోనజంబు’ సినిమా సోనీ LIV ఓటీటీ లో విడుదల అవనుంది. ఇలా విడుదలైన అన్ని సినిమాలు మంచి టాక్ తో హిట్ అయ్యి రాబోయే సినిమాలకి హోప్ ఇవ్వాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular