fbpx
HomeMovie Newsశరవేగంగా షూటింగ్ ముగించిన సూపర్ స్టార్

శరవేగంగా షూటింగ్ ముగించిన సూపర్ స్టార్

RajiniKanth FinishedShootFor AnnatheMovie

కోలీవుడ్: రజినీకాంత్ హీరోగా ‘అన్నాథే’ అనే సినిమా రూపొందుతుంది. తెలుగు లో ‘లక్ష్యం’ సినిమా తీసిన శివ తమిళ్ లో అజిత్ తో వరుసగా ‘వివేకం’, ‘విశ్వాసం’, ‘వేదాళం’ లాంటి సూపర్ మాస్ సినిమాలు తీసి ప్రస్తుతం రజినీకాంత్ ని డైరెక్ట్ చేసి అవకాశం పొందాడు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్య హైదరాబాద్ లో నైట్ కర్ఫ్యూ ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రత్యేక అనుమతులు తీసుకుని ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడీ గా నయనతార నటిస్తుంది.

35 రోజులుగా నిరంతరంగా జరిపిన ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ని ముగించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంత వయసులో కూడా రజిని కాంత్ చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని కరోనా టైం లో కూడా నిరవధికంగా శ్రమించి ఈ సినిమా షూటింగ్ పార్ట్ ని ముగించారు. ఈ రోజు ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుని చెన్నై కి బయలుదేరారు. సన్ పిక్చర్స్ వారి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. మురుగదాస్ దర్శకత్వంలో చివరగా దర్బార్ సినిమాతో పలకరించిన రజినీకాంత్ ఈ సినిమాని దీపావళి కి విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కరోనా కల్లోలం ముగిసి పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమా టీం దీపావళి కి సినిమాని విడుదల చేయడానికి సంసిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular