fbpx
HomeMovie Newsమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: 'ఏ జిందగీ' పాట విడుదల

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: ‘ఏ జిందగీ’ పాట విడుదల

Zindagi SongReleasedFrom MostEligibleBachelor

టాలీవుడ్: అక్కినేని వారసుడిగా అరంగేట్రం చేసి ఇప్పటివరకు మూడు సినిమాలతో పలకరించిన హీరో ‘అఖిల్’. ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం రాలేదు ఈ కుర్ర హీరోకి. ప్రస్తుతం బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ క్లాస్సీ గా ఆకట్టుకున్నాయి. ఈ రోజు ఈ సినిమా నుండి మరో పాట విడుదలైంది.

‘ఏ జిందగీ’ అంటూ సాగే ఈ పాట మంచి క్లాస్ మెలోడీ బీట్ తో ఆకట్టుకుంది. ‘జిందగీ – ఎ స్టీరింగ్ మెలోడీ ఫర్ లాంగ్ డ్రైవ్’ అంటూ ఈ పాట ప్రమోషనల్ వీడియో ని కూడా విడుదల చేసింది సినిమా టీం. సినిమా టీం వేరే వేరే డ్రైవ్స్ లో ఈ పాటని ఆలపిస్తూ షూట్ చేసి వీడియో ని రూపొందించారు. మధ్య మధ్యలో పాట సినిమా వెర్షన్ కొన్ని బైట్స్ ఆడ్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఓవరాల్ గా ఆడియో మరియు వీడియో తో ఈ పాట ని ఆకట్టుకునేలాగా ప్రెసెంట్ చేసారు సినిమా టీం.

ఈ సినిమాతో ఎలా ఐన కం బ్యాక్ అవ్వాలని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, ఎలా ఐన ఈ సారి హిట్ కొట్టాలని అఖిల్ మంచి ఔట్పుట్ కోసం కష్టపడుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘GA2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీవాసు మరియు వాసు వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ ఈ సినిమాకి అందించిన సంగీతం స్పెషల్ గా నిలవనుంది. ఈ సినిమాని జూన్ 19 న విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular