fbpx
HomeMovie Newsషూటింగ్ మొదలుపెట్టిన విశాల్ కొత్త సినిమా

షూటింగ్ మొదలుపెట్టిన విశాల్ కొత్త సినిమా

Vishal NotACommanMan ShootCommencement

కోలీవుడ్: ఈ సంవత్సరం ఫిబ్రవరి లో ‘చక్ర‘ సినిమాని విడుదల చేసిన విశాల్ తన తదుపరి సినిమా షూటింగ్ ని ఇవాళ మొదలుపెట్టాడు. ఇంతకుముందే ఈ సినిమాని ప్రకటించిన విశాల్ ఈరోజు ఈ సినిమాని మొదలుపెట్టాడు. vishal 31 గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘NOT A COMMANMAN ‘ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాని ఈ టైటిల్ తోనే ప్రచారం చేస్తున్నారు కానీ ఇదే టైటిల్ పెడతారా అనేది ఇంకా ప్రకటించలేదు.

అభిమన్యుడు, చక్ర లాంటి ఇంటెలిజెంట్ థ్రిల్లర్స్ తో అలరించిన విశాల్ మళ్ళీ ఈ సినిమాకి కూడా అలాంటి సబ్జెక్టు నే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో కూడా సైబర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని వాడుతున్నట్టు హింట్స్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా రవి తేజ ఖిలాడీ సినిమాలో నటిస్తున్న డింపుల్ హయాతి కోలీవుడ్ కి పరిచయం అవుతుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రచన మరియు దర్శకత్వం తు.ప.శరవణన్ చేయనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో ఈ సినిమా రూపొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular