fbpx
HomeMovie Newsకొత్త షో హోస్ట్ చేయనున్న వెర్సటైల్ యాక్టర్

కొత్త షో హోస్ట్ చేయనున్న వెర్సటైల్ యాక్టర్

VijaySethupathi toHost MasterChefTVShow

కోలీవుడ్: తన నటన తో , స్క్రీన్ ప్రెజన్స్ తో నేషన్ వైడ్ అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరో అంటే తెల్లగా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి లాంటి పరిధుల్ని చెరిపేస్తూ తన నాచురల్ నటనతో అభిమానుల్ని సంపాదిస్తున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ లో వరుస ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నాడు. బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ సినిమాని కూడా వదులుకున్నాడు.

ఈ హీరో ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ ఒక కొత్త షో హోస్ట్ చేయనున్నాడు. కుకింగ్ షోస్ ఎక్కువ చూసే వాళ్లకి మాస్టర్ చెఫ్ పేరు తెలిసే ఉంటుంది. ఈ షో ని తమిళ్ లో మొదటి సారిగా టెలికాస్ట్ చేయనున్నారు. ఈ షో కి హోస్ట్ గా విజయ్ సేతుపతి కి ఎంచుకున్నారు. ఈ షో ని సన్ టీవీ లో టెలికాస్ట్ చేయనున్నారు. ఈ షో కోసం విజయ్ సేతుపతి ఒప్పుకున్న తర్వాత ఒక చిన్న వీడియో బైట్ కూడా విడుదల చేసారు సన్ TV టీం.

హెలికాప్టర్ దిగి వస్తూ అభివాదం చేస్తున్న విజయ్ సేతుపతి ఈ వీడియో లో కనిపిస్తాడు, దాంతో పాటు ఈ షో త్వరలో ప్రారంభం అవనున్నట్టు ప్రకటించారు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఈ షో కోసం సన్ TV వాళ్ళు విజయ్ సేతుపతి కి బాగానే పారితోషకం ఇచ్చినట్టు టాక్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular