fbpx
HomeMovie Newsవిద్యా బాలన్ 'షేర్ని' ట్రైలర్ విడుదల

విద్యా బాలన్ ‘షేర్ని’ ట్రైలర్ విడుదల

VidyaBaalan SherniMovie TrailerRelease

బాలీవుడ్: విద్యా బాలన్ ప్రధాన పాత్రలో హిందీ లో ‘షేర్ని’ అనే సినిమా రూపొందింది. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. అడవికి దగ్గర్లో ఉండే ఒక గ్రామస్థులని పులి చంపుతుంది అనే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభించారు. ఆ పులిని పట్టుకొనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ‘విద్యా బాలన్’ అడుగుపెడతారు. ఇలాంటి సమస్యకి లేడీ ఆఫీసర్ ని పెడతారా అని ఊరి ప్రజలు, ఆమె ఏమి చేయలేదు అని డిపార్ట్మెంట్ వాళ్ళు తమ సుపీరియర్ అని కూడా లేకుండా విద్యా బాలన్ తో బెహేవ్ చేస్తుంటారు. ఓవరాల్ గా అక్కడ పులి ఆ గ్రామస్తుల్ని చంపుతుందా, లేక వేరే ఎవరైనా హత్యలు చేస్తున్నారా అనే థ్రిల్ ఉండబోతుందని ట్రైలర్ లో చూపించారు.

ఒక ఫారెస్ట్ థ్రిల్లర్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ ని కూడా ట్రైలర్ లో చూపించారు. రాజ్ కుమార్ రావు నటించిన ‘న్యూటన్’ మేకర్స్ ఈ సినిమాని రూపొందించారు. విద్యా బాలన్ తో పాటు విజయ్ రాజ్, నీరజ్ కబీ, శరత్ సక్సేనా, బ్రిజేంద్ర, ఇలా అరుణ్ మరిన్ని పాత్రల్లో నటించారు. అబుందన్తియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసుర్కర్ ఈ సినిమాని నిర్మించారు. అమిత్ మసుర్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. జూన్ 18 న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ లో ఈ సినిమా విడుదలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular