fbpx
HomeMovie Newsవరుణ్ సందేశ్ హీరోగా 'ఇందువదన' ఫస్ట్ లుక్

వరుణ్ సందేశ్ హీరోగా ‘ఇందువదన’ ఫస్ట్ లుక్

VarunSandesh IndhuVadanaMovie FirstLook

టాలీవుడ్: కెరీర్ అరంగేట్రం ‘హ్యాపీ డేస్’ లాంటి సినిమాతో ఆరంభించి, వెంటనే కొత్త బంగారు లోకం లాంటి సోలో హిట్ కొట్టి మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్లు అనిపించుకున్న హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత దాదాపు ఇరవై సినిమాలు తీసాడు కానీ హిట్ సాధించలేకపోయారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత ప్రేక్షకులని తన వర్క్ ద్వారా పలకరించలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక సినిమా ఫస్ట్ లుక్ తో మళ్ళీ మన ముందుకొచ్చాడు ఈ యువ హీరో.

మెగా స్టార్ చిరంజీవి ఫేమస్ పాట లోని కాచీ లైన్ ని టైటిల్ గా పెట్టుకుని వస్తున్నాడు వరుణ్ సందేశ్. ‘ఇందువదన’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పీరియడ్ సినిమా ని తలపిస్తుంది ఈ సినిమా. షర్ట్ లేకుండా దోతి కట్టుకుని హీరోయిన్ ని హత్తుకుని ఉండే ఈ ఫస్ట్ లుక్ హీరో వరుణ్ సినిమా కి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్ లో నైనీషా మరియు సాత్విక్ సమర్పణలో ఆదుర్తి మాదవి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఫర్నాజ్ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో మహేష్ విట్టా, ధన్ రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలోని మిగతా నటీనటుల వివరాలు మరియు విడుదల వివరాలు మున్ముందు తెలియనుంది. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ కం బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular