fbpx
HomeMovie Newsవరుడు కావలెను- 'దిగు దిగు నాగ' సాంగ్ రిలీజ్

వరుడు కావలెను- ‘దిగు దిగు నాగ’ సాంగ్ రిలీజ్

VaruduKavalenu Song Release

టాలీవుడ్: వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న యూత్ హీరో నాగ శౌర్య ‘లక్ష్య’ మరియు ‘వరుడు కావలెను’ సినిమాలని ముందుగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ‘వరుడు కావలెను’ సినిమా నుండి దిగు దిగు దిగు నాగ పాటని ఈ రోజు విడుదల చేసారు. ఈ సినిమాలో శౌర్య కి జోడీ గా తెలుగు నటి రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది.

‘దిగు దిగు దిగు నాగ.. నాగో న దివ్యా సుందర నాగో నాగా’ అంటూ పాడుకునే ఫోక్ సాంగ్ ని ఈ సినిమా కోసం మోడర్న్ మ్యూజిక్ జత చేసి ఈ పాటని రూపొందించారు థమన్. ఈ పాట లిరికల్ వీడియో కూడా విడుదల చేసారు. వీడియో లో రీతూ వర్మ ఫోక్ డాన్స్ స్టెప్ లతో అలరించింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా నుండి వస్తున్న పోస్టర్స్, ముందు విడుదలైన పాటలు ఈ సినిమా పైన మంచి ఇమేజ్ ని క్రియేట్ చేశాయి.

నాగ శౌర్య హీరో గా నటిస్తున్న ‘వరుడు కావలెను’ సినిమాని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నదియా , మురళీశర్మ , వెన్నెల కిశోర్ , ప్రవీణ్ , హర్ష వర్ధన్ తదితరులు నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్య అనే నూతన డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular