fbpx
Thursday, April 25, 2024
HomeMovie Newsఆగష్టు 22 న మెగాస్టార్ 'ఆచార్య' ఫస్ట్ లుక్

ఆగష్టు 22 న మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ లుక్

Unveling megastarAcharya Firstlook

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టినట్టు మెగా స్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవగా కరోనా వల్ల ఈ సినిమాకి మొత్తానికే బ్రేక్ పడింది.

మెగా స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22 వ తేదీన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చెయ్యతోబున్నట్టు టీం ప్రకటించింది. కొరటాల శివ అంటేనే ఏదో ఒక సామాజిక సమస్య తీసుకొని దానితో పాటు కమెర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ ఉండేట్లు చూసుకొని ఇప్పటికి వరుస హిట్లు సాధించారు. చిరంజీవి తో కూడా అదే బాటలో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. అలాగే చాలా రోజుల తర్వాత మెగాస్టార్, మణిశర్మ కాంబో రిపీట్ అవబోతోంది. ఇది వరకు చిరంజీవికి మంచి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular