fbpx
HomeMovie Newsపాన్ ఇండియా సినిమా తో రాబోతున్న మళయాళ హీరో

పాన్ ఇండియా సినిమా తో రాబోతున్న మళయాళ హీరో

TovinoThomas As MerupuMuraliFirstLook

మాలీవుడ్: మళయాళం హీరో టావినో థామస్ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. కరోనా వైరస్ ప్రబలుతున్న పరిస్థితుల్లో ఆ వైరస్ ప్రభావం, వ్యాప్తి గురించి ఒక రెండు మూడు సినిమాలు లాక్ డౌన్ లో చాలా మంది చూసారు. అందులో ‘వైరస్’, ‘ఫోరెన్సిక్’ సినిమాలతో ఈ హీరో అన్ని ప్రాంతాల్లో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక సూపర్ హీరో కథలో నటిస్తున్నాడు. ఆ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

బేసిల్ జోసఫ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా పేరు ‘మిన్నల్ మురళి’. ఈ సినిమాని మళయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చెయ్యబోతున్నారు. తెలుగులో ‘మెరుపు మురళి’ అని తమిళ్ లో ‘మిన్నల్ మురళి’ అని, కన్నడ లో ”మించు మురళి” అని హిందీ లో ‘మిస్టర్ మురళి ‘ అని టైటిల్స్ పెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేసారు ఈ సినిమా టీం. వీకెండ్ బ్లాక్ బస్టర్ బ్యానర్ పైన సోఫియా పాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ఆగష్టు 31 న ఓనం పండగ పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular