బాలీవుడ్: బాలీవుడ్ అటు సుశాంత్ మరణం ని, డ్రగ్స్ అని , మీ టూ అని రకరకాల వివాదాల్లో నలిగిపోతుంది. అలంటి సమయం లో కొంచెం రిలీఫ్ గా ఒక బాలీవుడ్ హీరో 100 మంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో చూస్తూ సంపాదించాడు . ప్రపంచం మొత్తం లో అత్యంత ప్రతిభావంతంగా, అత్యంత ప్రభావం చూపగల వ్యక్తుల జాబితాను టైం సిద్ధం చేసింది. అందులో ఇండియా లోంచి కేవలం ‘ఆయుష్మాన్ ఖురానా‘ ఒక్కడే భాగం అయ్యాడు.
2020లో టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత దేశం మొత్తం నుండి ‘ఆయుష్మాన్ ఖురానా’ భాగం అయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసాడు ఈ హీరో. ఈ గుర్తింపుతో ఆయుష్మాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టార్ల జాబితాలో చేరారు. అతడు ఈ చోటికి చేరుకోవడంలో ఆయన కృషి అంకితభావాన్ని చాలా మంది ప్రశంసించారు. ఆయుష్మాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఈ వార్తలను పంచుకున్నాడు. అతను ఒక అరుదైన గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు.
‘మన కథానాయకులు తరచూ తెరపై మూస పాత్రలతో బలైపోతారు. ఆయుష్మాన్ విజయవంతంగా , నమ్మకంగా ఆ మూస పద్ధతులను సవాలు చేసే పాత్రలతో సత్తా చాటాడు’ అంటూ దీపిక పొగిడేసింది. 130 కోట్ల జనాభాలో ఒకే ఒక్కడూ అంటూ పొగిడేసిన దీపిక పొగడ్త ఆయుష్మాన్ కి బిగ్ బూస్ట్ ఇచ్చేదే. ఇక బాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన యువహీరోగా ఆయుష్మాన్ కి గుర్తింపు ఉంది.