fbpx
Thursday, May 2, 2024
HomeMovie Newsథీమ్ ఆఫ్ 'సినిమా బండి' సాంగ్ రిలీజ్

థీమ్ ఆఫ్ ‘సినిమా బండి’ సాంగ్ రిలీజ్

ThemeOf CinemaBandi SongRelease

టాలీవుడ్: బాలీవుడ్ లో ‘షోర్ ఇన్ ది సిటీ’, ‘గో గోవా గాన్’ , ‘స్త్రీ’ సినిమాలతో పాటు ‘ఫామిలీ మాన్’ లాంటి సిరీస్ ని రూపొందించిన తెలుగువారు అయిన రాజ్ నిడిమోరు మరియు డీ.కే. కృష్ణ నిర్మాతలుగా ‘సినిమా బండి’ అనే చిన్న సినిమా రూపొందించారు. పూర్తి ఓటీటీ కంటెంట్ గా రూపొందిన ఈ సినిమా రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది. పల్లెటూర్లో ఆటో నడుపుకునే ఒక వ్యక్తి తన ఆటో లో దొరికిన ఒక కెమెరా తో , అసలు అది ఎలా పని చేస్తుందో కూడా తెలియకుండా దానితో సినిమా తీస్తాడు. ఈ క్రమం లో అతను, అతను సినిమా కోసం ఎంచుకునే మనుషుల మధ్య ఘర్షణ, ఇబ్బందులని హ్యూమరస్ వే లో ఈ సినిమాలో ప్రెసెంట్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

ఈ సినిమా నుండి ‘బావిలో కప్పల్లా’ అంటూ సాగే థీమ్ సాంగ్ ని విడుదల చేసారు. ప్రతి ఒక్కరు తమ హృదయం లో ఫీల్ మేకర్ ఏ అన్న టాగ్ లైన్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ పాటలో కూడా అంతర్లీనంగా అదే విషయాన్ని ప్రస్తావించారు. నీళ్లలో చేప కి ఈత ఎవరు నేర్పుతారు లాంటి అర్థాలతో పాటని రాసారు. శిరీష్ సత్యవోలు. ఈ సినిమాకి సంగీతం మాత్రమే కాకుండా ఈ పాటని రాసి ఆలపించారు కూడా. వసంత్ మరిగంటి రచనలో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular