fbpx
HomeMovie News'ఇష్క్ - ఇది ప్రేమ కథ కాదు ' ట్రైలర్ విడుదల

‘ఇష్క్ – ఇది ప్రేమ కథ కాదు ‘ ట్రైలర్ విడుదల

TejaSajja IshqMovie TrailerReleased

టాలీవుడ్: బాల నటుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన నటుడు తేజ సజ్జ. పెద్దయ్యాక ‘ఓ బేబీ’ సినిమాతో మరో సారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ చూసాడు. మొదటి సినిమా షూటింగ్ లో ఉండగానే రెండో సినిమా కూడా పూర్తి చేసాడు ఈ కుర్ర హీరో. ఈ నటుడు నటించిన రెండవ సినిమా ‘ఇష్క్‘ వచ్చే వారం విడుదల అవనుంది. మూవీ ప్లానింగ్ తో పాటు కరోనా కారణంగా సినిమాలు అన్నీ వెనక్కి తగ్గడంతో తన ఒక్క సినిమా నే విడుదలయ్యేట్టు చూసుకొని రిలీజ్ ప్లానింగ్ లో కూడా హుషారు చూపించాడు.

చాలా రోజుల తర్వాత మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ తెలుగు లో ఈ సినిమాతో కం బ్యాక్ అవుతుంది. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ , వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఒక లవ్ స్టోరీ లాగా సినిమా ట్రైలర్ ని మొదలుపెడతాడు. హీరోయిన్ బర్త్ డే కి సర్ప్రైజ్ ప్లాన్ చేసి కార్ లో ఒక చోటికి తీసుకెళ్తుంటాడు. అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదుర్కొంటాడు. టైటిల్ లో చెప్పినట్టు అప్పటివరకు లవ్ స్టోరీ లాగ అనిపించిన ఈ సినిమా థ్రిల్లర్ లా మారుతుంది.

అక్కడి నుండి చేజ్ లు , సస్పెన్స్ డ్రామా , హీరోయిన్ కోసం హీరో వెతుకులాట.. ట్రైలర్ మొత్తం ఈ సీన్స్ తో నింపి సస్పెన్స్ క్రియేట్ చేయగలిగాడు డైరెక్టర్. ఈ సినిమా మలయాళం లో రూపొందిన ‘ఇష్క్’ సినిమాకి రీమేక్ గా రూపొందనున్నట్టు ట్రైలర్ మరియు సాంగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమా చూసేవాళ్ళకి తెలుస్తుంది. యస్.యస్.రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 23 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular