fbpx
Wednesday, April 24, 2024
HomeBusinessటాటా కార్లపై ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

టాటా కార్లపై ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

TATA-MOTORS-FESTIVE-DISCOUNTS

ముంబై: భారత్ కు చెందిన టాటా మోటార్స్ వాహన సంస్థ తన కార్లపై మరోసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రానున్న పండుగ సీజన్ సందర్భంగా తమ కార్లపై ధరల తగ్గింపును ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు అందుబాటులో ఉంటాయి అని తెలిపింది. ముఖ్యంగా బీఎస్-6 ఇంజీన్ కలిగిన ఎస్‌యూవీ టాటా హ్యారియర్ కారుపై 80 వేల రూపాయల వరకు రాయితీ ఇస్తోంది.

ఈ రాయితిలో ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కన్స్యూమర్ స్కీమ్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. బీఎస్6 కార్లకు మాత్రమే అందుబాటులో ఉంచిన సంస్థ నెక్సాన్, టైగోర్, టియాగో, హారియర్ పై డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రం డిస్కౌంట్‌లను ప్రకటించలేదు.

రాయితీ ఇలా వర్తిస్తుంది: 25 వేల క్యాష్ డిస్కౌంట్, 15 వేల రూపాయల అదనపు కార్పోరేట్ ఆఫర్, 40 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది. టాటా హ్యారియర్ మోడల్లోని ఆటోమేటిక్ వేరియంట్లైన డార్క్ ఎడిషన్ ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ఏ ప్లస్ మినహా మిగతా అన్నిమోడళ్లకు తగ్గింపు ధరలను అందిస్తోంది. హారియర్ 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -స్పీడ్ ఆటోమేటిక్ , మాన్యువల్ ట్రాన్మిషన్లలో లభ్యం. ఎస్‌యూవీ ధర 13.84 లక్షలు

టియాగో పై 32,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. కన్స్యూమర్ స్కీమ్ 15 వేలు, 7 వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, 10 వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కలిపి మొత్తం ప్రయోజనం 32 వేలు. అయితే కార్పొరేట్ ఆఫర్ టాటా గ్రూప్ , టీఎంఎల్ ఉద్యోగులు, టాటా ట్రస్ట్ ఇండియా, టాటా గ్రూప్ ఎస్ఎస్ఎస్ రెఫరల్, టాప్ 10 , టాప్ 20 కార్పొరేట్స్ తోపాటు, కోవిడ్-19 యోధులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది అని తెలియజేసింది.

టాటా మోటార్స్ నుంచి వచ్చిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ మోడల్ పై 15 వేల రూపాయల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఇచ్చింది. అయితే డీజిల్ వేరియంట్లో మాత్రమే, డీజిల్ డెరివేటివ్‌ను ఎంచుకునే వినియోగదారులకు 10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఆఫర్లు ఉన్నప్పటికీ చాలా స్వల్పంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular