fbpx
HomeMovie Newsఓటీటీ లో తాప్సి కొత్త సినిమా

ఓటీటీ లో తాప్సి కొత్త సినిమా

TapseePannu HaseenaDilruba OnNetflix

బాలీవుడ్: థియేటర్ లు తెరుచుకునే అవకాశం దగ్గర్లో కనిపించకపోవడం తో విడుదలకి సిద్ధం గా ఉన్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి ఓటీటీ బాట పట్టాయి. సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద నటుడే ఒక సంవత్సర కాలం ఎదురు చూసి చివరకి పే పర్ వ్యూ పద్దతిలో ‘రాధే’ సినిమాని ఓటీటీ లో విడుదల చేసారు. ఇంకా చాలా చిన్న సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఆ కోవలోకి తాప్సి పన్ను నటించిన ‘హసీన్ దిల్ రుబా’ అనే సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదలవనుంది. జులై 2 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.

పెళ్లి అయినా కూడా వేరే వారి మోజులో పడి భర్త మరణానికి కారణం అయ్యే సస్పెన్స్ పాత్రలో తాప్సి నటిస్తుంది. మరి హత్య ఎవరు చేశారు అనే థ్రిల్లర్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా వినీల్ మాథ్యూ దర్శకత్వంలో రూఒపొందింది. ఈ సినిమాలో తాప్సి కి జోడీ గా విక్రాంత్ మాస్సే , హర్షవర్ధన్ రాణే నటించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆనంద్ ఎల్. రాయ్ , హిమాన్షు శర్మ ఈ సినిమాని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular