fbpx
HomeMovie Newsసునీల్ హీరోగా 'బుజ్జి ఇలా రా'

సునీల్ హీరోగా ‘బుజ్జి ఇలా రా’

Sunil BujjiIlaaraa Announcement

టాలీవుడ్: కెమెడియన్ గా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్లు సాధించి హీరో గా మారి మొదట రెండు మూడు హిట్లు కొట్టి తరువాత వరుస ప్లాప్ లు ఎదుర్కొన్నాడు సునీల్. ప్రస్తుతం తన వద్దకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుని మరో సారి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సీనియర్ కమెడియన్ సునీల్. హీరో గా, కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నాడు సునీల్ . ప్రస్తుతం సునీల్ హీరో గా మరో కామెడీ మూవీ ప్రకటించారు. జబర్దస్త్ , బిగ్ బాస్ షో ల ద్వారా ఫెమస్ అయినా ధనరాజ్ మరియు సునీల్ హీరో లుగా ‘బుజ్జి ఇలా రా’ అనే ఒక సినిమా ప్రకటించారు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది.

కెరీర్ ప్రారంభం నుండి కామెడీ సినిమాలని రూపొందించిన డైరెక్టర్ జి.నాగేశ్వర్ రెడ్డి. రీసెంట్ గా ఈయన నుండి సందీప్ కిషన్ హీరో గా ‘ తెనాలి రామ కృష్ణ BA BL ‘ రూపొందించారు. సినిమా పరవాలేదనిపించింది. సందీప్ కిషన్ హీరో గానే ‘గల్లీ రౌడీ’ అనే మరో కామెడీ సినిమాని రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి జి.నాగేశ్వర్ రెడ్డి కథ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. SNS క్రియేషన్స్ బ్యానర్ పై రూప జగదీశ్ సమర్పణలో నాగి రెడ్డి మరియు సంజీవ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నారు. గరుడవేగా లాంటి సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన అంజి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా గురించి మిగతా అప్ డేట్స్ మరి కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular