fbpx
HomeMovie Newsసుమంత్ 'కపటధారి' ఫస్ట్ సింగిల్ విడుదల

సుమంత్ ‘కపటధారి’ ఫస్ట్ సింగిల్ విడుదల

Sumanth Kapatadhaari FirstSingleReleased

టాలీవుడ్: అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘ కపటధారి’. కన్నడ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా ‘కావల్దార్’ కి ఈ సినిమా రీ మేక్ గా రాబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు సుమంత్. ‘మళ్ళీ రావా’ సినిమా ద్వారా మంచి హిట్ వచ్చింది అనుకున్నా కానీ కలెక్షన్స్ అంతగా రాకపోవడం, జనాలకి ఆ సినిమా టాక్ రీచ్ అయ్యే వరకే సినిమా థియేటర్ లలోంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు తీసినా కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇపుడు ‘కపటధారి’ అనే కంటెంట్ ఉన్న రీ మేక్ తో మన ముందుకు రాబోతున్నాడు సుమంత్.

ఈ సినిమా నుండి హయాకి బేబీ అనే ఫస్ట్ సాంగ్ విడుదల చేసారు. సైమన్ కే కింగ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ పాట ఒక రాప్ మరియు స్లో పార్టీ సాంగ్ లా ఉంది. ప్రదీప్ కృష్ణ మూర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సుమంత్ కి జోడీ గా నందిత శ్వేత నటిస్తుంది. ఒక మిస్టరీ కథ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగించుకుని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా కూడా క్రిస్టమస్ టైం లో థియేటర్లలో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. ధనంజయన్ మరియు లలిత ధనంజయన్ ఈ సినిమాని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular