fbpx
HomeMovie Newsరిలీజ్ డేట్ ప్రకటించిన మరో చిన్న సినిమా

రిలీజ్ డేట్ ప్రకటించిన మరో చిన్న సినిమా

SRKalyanaMandapam Release Date

టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్ని రోజులు థియేటర్లు మూతపడి ఉండడం తో ఎన్నో సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇపుడు థియేటర్ లు తెరుచుకునే అవకాశం ఇచ్చినా కూడా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా థియేటర్ ల టికెట్ రేట్ల బిల్లు మార్చకవపోడం తో ఇంకా కొత్త సినిమాలు విడుదల అవ్వట్లేదు. ఈ సమయంలో జులై 30 న తమ సినిమా థియేటర్లలో విడుదలవనున్నట్టు సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు‘ టీం ప్రకటించింది.

ఇదే ఫ్లో లో మరో చిన్న సినిమా కూడా తమ సినిమా విడుదల తేదీ ని ప్రకటించింది. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో పరిచయం అయిన నటుడు ‘కిరణ్ అబ్బవరం‘. ఈ నటుడు హీరో గా ‘SR కల్యాణ మండపం EST 1975 ‘ అనే సినిమా రూపొందింది. దాదాపు సంవత్సరం నుండి ఎదురు చూసిన ఈ సినిమా టీం ఎట్టకేలకి విడుదల తేదీ ని ప్రకటించింది ఆగష్టు 6 న ఈ సినిమా విడుదల అవనున్నట్టు ప్రకటించింది సినిమా టీం. మరి థియేటర్ లలో విడుదల అవుతుందా లేక ఓటీటీనా అనే విషయం క్లారిటీ లేదు కానీ థియేటర్లలోనే విడుదల అవనున్నట్టు తెలుస్తుంది.

ఒక పూర్తి కామెడీ మరియు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందియింది అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇంజనీరింగ్ చదివే ఒక అబ్బాయి వూర్లో తనని తాను సక్సెస్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవడానికి తన తండ్రి కి సంబందించిన ఒక కల్యాణ మండపం ని పునరుద్ధరించి బిజినెస్ మొదలు పెడతాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సక్సెస్ తో జోష్ లో ఉన్న ఈ సినిమా టీం మంచి విజయాన్ని పొందాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular