fbpx
HomeMovie Newsఅనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు సినిమా

అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీ విష్ణు సినిమా

Srivisshnu GaaliSampath FirstLook

టాలీవుడ్: F2 , పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్, సరిలేరు నీకెవ్వరూ లాంటి హిట్ చిత్రాలని రూపొందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రొడ్యూసర్ గా కొత్త అవతారం ఎత్తాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఒక సినిమాకి సమర్పకుడిగా రాబోతున్నాడు. సెన్సిబుల్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక అభిమానులని పెంచుకుంటూ పోతున్న శ్రీ విష్ణు ఈ సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. అనిల్ రావిపూడి సమర్పణలో ‘గాలి సంపత్’ అనే సినిమాని ప్రారంభించారు. పటాస్ నుండి ఇప్పటివరకు అనిల్ రావిపూడి చేసిన అన్ని సినిమాలకి తనతో పాటు ప్రయాణం చేసిన ఎస్. క్రిష్ణ తో కలిసి ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల్ని నిర్మించిన సాహు గారపాటి , హరీష్ పెద్ది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ది అవడం ప్రత్యేకత. శ్రీ విష్ణు కి జోడీ గా లవ్లీ సింగ్ అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. ఈ సినిమాకి అనిల్ రావిపూడి రచన సహకారం కూడా అందిస్తున్నాడు. తండ్రీ కొడుకులు మధ్య ఉండే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అటాచ్మెంట్ ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం అని మేకర్స్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular