న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో గురువారం సాయంత్రం చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని సర్ గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ (బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్) డాక్టర్ డి ఎస్ రానా తెలిపారు.
“జూలై 30, 2020 సాయంత్రం 7 గంటలకు సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. డిస్చార్జ్ చేసే సమయంలో ఆమె పరిస్థితి స్థిరంగా ఉంది” అని ఆసుపత్రి ఆరోగ్య బులెటిన్ పేర్కొంది.
శుక్రవారం, సర్ గంగా రామ్ హాస్పిటల్ ఆమెను సాధారణ పరీక్షలు మరియు ఆరోగ్య స్థితి తనిఖీ కోసం ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది. ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేసి ఆరొగ్య స్థితిని తెలుసుకొవడానికి మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించినట్ట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఆమె పూర్తి ఆరొగ్యంగ ఉన్నట్లు తెలిపారు.