fbpx
HomeMovie Newsషూటింగ్ పూర్తి చేసుకున్న నితిన్ 'మేస్ట్రో'

షూటింగ్ పూర్తి చేసుకున్న నితిన్ ‘మేస్ట్రో’

ShootCompletedFor Nithin MaestroMovie

టాలీవుడ్: యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరంలో ‘చెక్’ మరియు ‘రంగ్ దే’ సినిమాలని విడుదల చేసాడు. ప్రస్తుతం ‘మేస్ట్రో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ లో ఆయుశ్మాన్ ఖురానా నటించిన ‘అందాదున్ ‘ సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమాలో అందుని ఛాయలు ఉండే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అయింది. ఏప్రిల్ లో మొదలైన షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కన్నా ముందే దాదాపు పూర్తి అయిపోయింది. ఒక వారం షూటింగ్ మిగిలి ఉండగా లాక్ డౌన్ సడలింపులు మొదలు పెట్టగానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టి నిన్ననే పూర్తి చేసారు.

వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ , ఎక్స్ప్రెస్ రాజా లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ నటిస్తుంది. మరొక ముఖ్య మైన పాత్రలో తమన్నా నటిస్తుంది. తమన్నా పాత్ర ఈ సినిమాలో కొంచెం కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్రలో తమన్నా ఇప్పటివరకు నటించింది లేదు. నితిన్ కి భీష్మ తో మ్యూజికల్ హిట్ అందించిన మహత్ స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఆకెళ్ళ రాజ్ కుమార్ సమర్పణలో నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసి ‘చల్ మోహన్ రంగ’ సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య తో ‘పవర్ పేట’ అనే పవర్ఫుల్ యాక్షన్ సినిమాని మొదలుపెట్టనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular