fbpx
HomeMovie Newsశర్వా 'ఒకే ఒక జీవితం' మోషన్ పోస్టర్

శర్వా ‘ఒకే ఒక జీవితం’ మోషన్ పోస్టర్

Sharwa OkeOkaJeevitam MotionPoster

టాలీవుడ్: ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాలెంటెడ్ హీరోల లిస్ట్ తీస్తే ముందు వరుసలో ఉంటాడు శర్వానంద్. టాలెంట్ ఉంది మంచి హిట్స్ ఉన్నప్పటికీ ఈ మధ్య ఎందుకో హిట్స్ విషయంలో తడపడుతున్నాడు. శ్రీకారం లాంటి సినిమా తో మంచి టాక్ సంపాదించినప్పటికీ కమర్షియల్ గా అంతగా హిట్ సాధించలేకపోయింది ఈ సినిమా. ప్రస్తుతం ‘RX100 ‘ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే ఇంటెన్స్ యాక్షన్ మరియు లవ్ స్టోరీ లో నటించాడు. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా మొదలుపెట్టాడు. శర్వా 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ కార్తీక్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ రోజు విడుదల చేసారు.

మోషన్ పోస్టర్ లో ఒక కాసెట్ ప్లే చేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో పాడు ఆది అంటూ పిలుస్తుండగా సింగింగ్ సెన్సేషన్ అనే బ్యాడ్జ్ చూపించి ఆడియో కాసెట్ రోలింగ్ చూపిస్తూ సైన్స్ ఫిక్షన్ ఎలెమెంట్స్ లాంటివి చూపిస్తూ ఒక్కసారిగా ఈ సినిమా పైన ఉన్న ఇమేజ్ మార్చగలిగాడు డైరెక్టర్. చివర్లో గిటార్ పట్టుకున్న శర్వా లుక్ చూపించి ముగించారు. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఇదొక ఎమోషనల్ అండ్ ఫామిలీ డ్రామా అనుకున్నారు కానీ ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఆ ఇంప్రెషన్ మార్చుకుంటారు. మరి ఇది ఏ జానర్ సినిమా అనేది మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది. ఈ సినిమాలో శర్వా తల్లి పాత్రలో అక్కినేని అమల నటిస్తున్నారు. హీరోయిన్ గా రీతూ వర్మ మరిన్ని పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియ దర్శి నటిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ రెండు భాషల్లో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular