fbpx
Tuesday, November 29, 2022

INDIA COVID-19 Statistics

43,403,319
Confirmed Cases
Updated on June 27, 2022 1:08 am
524,999
Deaths
Updated on June 27, 2022 1:08 am
105,922
ACTIVE CASES
Updated on June 27, 2022 1:08 am
42,772,398
Recovered
Updated on June 27, 2022 1:08 am
HomeBusinessతమ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ!

తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ!

SBI-FIXED-DEPOSIT-RATES-TO-BE-INCREASED-SOON

ముంబై: భారత దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు ఒక శుభవార్తను ప్రకటించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వ‌డ్డీ రేట్లు పెంచే సంకేతాలిచ్చింది. తాజాగా జరిగిన ద్వైమాసిక రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచబోతున్నట్టు నేషనల్‌ మీడియా తెలిపింది. ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతానికి నిర్ణయించింది. దీని వల్ల పలు రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది. కాగా ఇటీవల ఆర్‌బీఐ క్రమంగా రేట్లు పెంచుతూ ఉంటే, బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాల్సి వస్తోంది.

తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కొత్త రేట్ల ప్రకారమే ఉంటాయనీ, ఇప్పటికే నిర్దిష్ట మెచ్యూరిటీల పై డిపాజిట్ రేట్లను పెంచాలని భావిస్తున్నట్టు ఖరా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎస్‌బీఐ 12 నెలల, 24 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మూడు నుండి ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular