fbpx
HomeMovie Newsసంతోష్ శోభన్ 'ప్రేమ్ కుమార్' ఫస్ట్ లుక్

సంతోష్ శోభన్ ‘ప్రేమ్ కుమార్’ ఫస్ట్ లుక్

SantoshShoban PremKumar MovieAnnouncement

టాలీవుడ్: చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘గోల్కొండ హై స్కూల్’ సినిమాలో నటించి పెద్దయ్యాక ‘తాను నేను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్. ఈ హీరో ఎవరో కాదు ప్రభాస్ నటించిన వర్షం సినిమాని డైరెక్ట్ చేసిన శోభన్ కి కొడుకు. ఆ తర్వాత ‘పేపర్ బాయ్ ‘ సినిమాలో నటించి కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా ‘ఏక్ మినీ కథ‘ అనే సినిమాతో బోల్డ్ అట్టెంప్ట్ చేసి ప్రొడ్యూసర్స్ , డైరెక్టర్స్ కళ్ళల్లో రిజిస్టర్ అయ్యాడు. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ సంతోష్ నటనకి మాత్రం అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ రెస్పాన్స్ సంతోష్ కి వరుస ఆఫర్లు కట్టబెట్టింది.

అందులో మొదటిది ఈరోజు ప్రకటించారు. సంతోష్ హీరో గా ‘ప్రేమ్ కుమార్’ అనే సినిమా ప్రకటించారు. ఈ సినిమాలో సంతోష్ పెళ్ళికి రెడీ గా ఉన్న ఒక యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరి సంతోష్ కోసం పెళ్లి కూతుర్లు రెడీ గా ఉన్నారా? అనే టాగ్ లైన్ జత చేసి ఫస్ట్ లుక్ విడుదల చేసింది సినిమా టీం. పెళ్లి కూతుర్లని అన్వేషించే క్రమం లో ‘ప్రేమ్’ కి కావాల్సిన క్వాలిటీస్ వెతకడం కి సింబాలిక్ గా ఒక బూతద్దం ని పెట్టినట్టు చూపించారు. ఈ కాన్సెప్ట్ నే వాడి కామెడీ జెనెరేట్ చేయబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమాని షరంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు . అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular