fbpx
Sunday, April 28, 2024
HomeMovie Newsరంజాన్ విడుదల మాట నిలబెట్టుకుంటున్న సల్మాన్ ఖాన్

రంజాన్ విడుదల మాట నిలబెట్టుకుంటున్న సల్మాన్ ఖాన్

SalmakKhan RadheMovieInTheatres OnRamzaan

బాలీవుడ్: బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ వీలైనంత వరకు ప్రతీ రంజాన్ కి తన సినిమా విడుదలయ్యేట్టు చూసుకుంటాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెంటిమెంట్ ఫాలో అవుతూ వస్తున్నాడు. 2020 రంజాన్ కి కూడా ‘రాధే’ అనే ఒక సినిమా విడుదల చేయాల్సి ఉంది. అప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా అయిపోయింది. కానీ అనుకోకుండా వచ్చిన కరోనా వల్ల థియేటర్ లు మూత పడడం, బిజినెస్ ఆగిపోవడం జరిగింది. ఇపుడు థియేటర్లు తెరచుకుంటుండడం తో సల్మాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తన సినిమాకి సంబందించిన స్టేట్మెంట్ విడుదల చేసాడు. పోయిన ఈద్ కి విడుదల చేస్తానన్న రాధే సినిమాని ఈ 2021 ఈద్ కి థియేటర్ లలో విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు.

ప్రముఖ డైరెక్టర్ ప్రభుదేవా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇదివరకే ‘వాంటెడ్'(పోకిరి రీమేక్) మరియు దబాంగ్ 3 సినిమాలకి వీళ్లిద్దరు కలిసి పని చేసారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడీ గా దిశా పటాని నటిస్తుంది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో మరో హీరో రణ్ దీప్ హుడా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమా ద్వారా సౌత్ హీరోయిన్ మేఘా ఆకాష్ బాలీవుడ్ కి పరిచయం అవుతుంది. ‘రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్’ అనే ఈ సినిమాని థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయండి అని చివరగా సల్మాన్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular