fbpx
Friday, April 26, 2024
HomeMovie Newsమహాసముద్రం: 'గూని బాబ్జి' ఫస్ట్ లుక్

మహాసముద్రం: ‘గూని బాబ్జి’ ఫస్ట్ లుక్

RaoRamesh FirstLook MahaaSamudram

టాలీవుడ్: RX100 తో దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. చాలా గ్యాప్ తీసుకుని ‘మహా సముద్రం’ అనే రెండవ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ని మల్టీ స్టారర్ గా రూపొందిస్తున్నాడు. ఇందులో హీరోలుగా శర్వానంద్ , బొమ్మరిల్లు సిద్దార్థ్ నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఎమాన్యూల్, జగపతి బాబు నటిస్తున్నారు. ఈ రోజు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం.

ఈ సినిమాలో రావు రమేష్ ‘గూని బాబ్జి’ పాత్రలో నటిస్తున్నారు. పెరుగు తగ్గట్టే ఒక చేయి గూని పోయి ఉన్న రావు రమేష్ లుక్ ని చూడవచ్చు. ఈ సినిమాని ఒక ఇంటెన్స్ లవ్ మరియు యాక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు అజయ్ భూపతి. అది ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కనపడుతుంది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో రావు రమేష్ ఈ మధ్య విలక్షణమైన పాత్రలు చేస్తూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. తన తండ్రి రావు గోపాల్ రావు లాగానే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా శ్రీకారం లో రావు రమేష్ నటనకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ లభిందించి. రావు రమేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు కే.జి.ఎఫ్ టీం కూడా రావు రమేష్ కి సంబందించిన పోస్టర్ ఒకటి విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular