టాలీవుడ్: కొద్దీ రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఒక ఇష్యూ గురించి రామ్ వరుసగా ట్వీట్లు పెడుతున్నాడు. విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ లో రమేశ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం గురించి రామ్ స్పందించాడు. దీన్ని రాజకీయం చేస్తున్నారని హెచ్చరించాడు. రామ్ వ్యాఖ్యలపై విజయవాడ ఏసీపీ మాట్లాడుతూ, అవసరమైతే రామ్ కు నోటీసులు ఇస్తామని అన్నారు. ఆ తర్వాత ఈ విషయం పై చెప్పాల్సింది చెప్పాను ఇక మీదట ట్వీట్లు చేయబోనని చెప్పాడు రామ్. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని చంద్రబాబు చెప్పారు. ట్వీట్ చేస్తే… విచారణకు అడ్డుపడుతున్నారంటూ నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని అన్నారు.
అయితే తాజాగా రామ్ కులం గురించి మరొక ట్వీట్ చేసాడు. ఈ విషయాన్ని బేస్ చేసుకుని చాలా మంది కులం పేరు తో రామ్ ని దూషిస్తున్నారు. దీనికి ప్రతి స్పందనగా ఆయన ఇలా ట్వీట్ చేసారు. ‘సోదర సోదరీమణులారా… కులం అనే జబ్బు కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. అది కరోనా కంటే భయంకరమైనది. సైలెంట్ గా విస్తరించే దీని బారిన పడకండి. ఇందులోకి లాగాలని ఎవరైనా ప్రయత్నించినా… దీని ఉచ్చులోకి పడొద్దు. అందరితో కలిసుండి స్ట్రాంగ్ గా ఉండండి’ అని ట్వీట్ చేసాడు. దీని వెనక ఉదేశ్యం తెలియదు గాని తన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సమస్య కి స్పందించినందుకు తాను చాలా ఇస్స్యూస్ ఎదురుకుంటున్నాడని అర్ధం అవుతుంది.
Sallapaddadu. Manchiga cinemalu cheskovale kani ge panchaituly manakendhuk ismart.