fbpx
HomeMovie Newsఆరియానా గెలుపు కోసం ఆర్జీవీ

ఆరియానా గెలుపు కోసం ఆర్జీవీ

RamgopalVarma SupportTo BigbossContestantAriyana

హైదరాబాద్: టెలివిజన్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ పాపులారిటీ ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు లో ఇప్పటికి మూడు సీజన్ లు ముగించుకొని నాల్గవ సీజన్ ప్రస్తుతం ప్రసారం అవుతుంది. ఇంకో పది రోజుల్లో నాల్గవ సీజన్ కూడా ముగియనుంది. ప్రస్తుతం ఆరుగురు పార్టిసిపంట్స్ బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ఆర్జీవీ ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ అయిన ఆరియానా కూడా ఉన్నారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో ఆర్జీవీ ని ఈ విషయం గురించి అడగగా తాను బిగ్ బాస్ చూడనని, కానీ ఆరియానని ని వొదిలి పెట్టనని తనతో సినిమా తీస్తానని తెలిపాడు.

ఒక రెండు రోజుల తర్వాత ఆరియానా ని సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ తన కోసమే చూస్తున్నానని, ఆరియానా కి వోట్ చేసి గెలిపించండని ట్విట్టర్ ద్వారా తెలిపాడు ఆర్జీవీ. ఆరియానా టెలివిజన్ ఇండస్ట్రీ లో చాలా రోజుల నుండి ఉన్నా కూడా ఆర్జీవీ ఇంటర్వ్యూ తో ఒక్క సారి ఫేమస్ అయింది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాదించింది. ఇపుడు ఆరియానా ని ఒక రాష్ట్రం మొత్తం గుర్తించేంత స్థాయి వచ్చింది. అంతే కాకుండా ఆరియానా క్యారెక్టర్ కి ఆటిట్యూడ్ కి అభిమానులు ఏర్పడ్డారు. దేనికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందని కూడా ఆరియానా కి మంచి పేరుంది. ఇప్పటి వరకు కొందరు సెలెబ్రిటీలు ఆరియానా కి స్వయంగా తమ మద్దతు తెలిపారు. ఇపుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా మద్దతు తెలపడం తో ఆరియానా గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది అనడం లో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular