fbpx
HomeMovie Newsమరో సినిమా ప్రకటించిన సీనియర్ హీరో రాజశేఖర్

మరో సినిమా ప్రకటించిన సీనియర్ హీరో రాజశేఖర్

Rajashekar LatestMovie Announcement

టాలీవుడ్: యాంగ్రీ యంగ్ మాన్ బిరుదు పొంది వరుస పోలీస్ కథలతో మెప్పించిన నటుడు రాజశేఖర్. గరుడ వేగ సక్సెస్ వచ్చిన తర్వాత కొంచెం సినిమాలు తగ్గించి ఒక్కో సినిమా జాగ్రత్త పడుతూ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ సినిమా కూడా పరవాలేదనిపించింది. ఈ మధ్యనే ఒక ఏజెడ్ పాత్రలో ‘శేఖర్‘ అనే సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం తన 92 వ సినిమా ని కూడా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఈ మధ్యనే ప్రైమ్ లో ‘గతం’ అనే సినిమా విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ తో కలిసి రాజ శేఖర్ ఒక సినిమాలో నటించాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా గురించి ఇవాళే అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ‘గతం’ డైరెక్టర్ కిరణ్ కొండమడుగల దర్శకత్వం లో ఈ సినిమా రూపొందనుంది. ఆఫ్ బీట్ ఫిలిమ్స్, ఎస్ ఒరిజినల్స్ , పెగాసస్ సినీ కార్పొరేషన్ బ్యానర్స్ పై రాజశేఖర్ కూతుళ్లు శివాణి, శివాత్మిక తో కలిసి సృజన్ , భార్గవ , హర్ష సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రకటన విడులా చేస్తూ ఒక ఓల్డ్ న్యూస్ పేపర్ లో న్యూస్ చూపిస్తూ, పక్కన గన్, వైన్ గ్లాస్, బుల్లెట్స్ లాంటివి చూపిస్తూ ఇది కూడా ఒక పోలీస్ స్టోరీ అన్నట్టు అని చెప్పకనే చెప్పినట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular