fbpx
HomeMovie News'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' - ట్రైలర్ విడుదల

‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ – ట్రైలర్ విడుదల

Priyadarshi InTheNameOfGod TrailerLaunch

టాలీవుడ్: 100 % తెలుగు కంటెంట్ అనే టాగ్ లైన్ తో మొదలైన ఆహా ఓటీటీ వరుసగా కంటెంట్ రెడీ చేస్తూ యూజర్స్ ని పెంచుకునే దిశగా వెళ్తుంది. వేరే బాషా సినిమాలు డబ్ చేసి విడుదల చేయడం, తెలుగు లోనే ప్రత్యేకంగా ఓటీటీ కోసం సినిమాల్ని , సిరీస్ లని రూపొందిస్తూ కంటెంట్ పెంచుకుంటూ వెళ్తుంది. ఇందులో భాగంగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే సిరీస్ రూపొందించారు. తెలుగు టాప్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.

ప్రియదర్శి డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘సైతాన్ కి , దేవుడు కి తేడా ఏంటో తెలుసా? . సైతాన్ మనల్ని తప్పు చేసేలా ప్రేరేపించి, తప్పు చేసాక దాని పర్యవసానాలు చూస్తూ ఎంజాయ్ చేస్తాడు, దేవుడు తప్పు చెయ్యగానే చంపేస్తాడు’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. తన పని తాను చేసుకుంటూ తనకంటూ ఒక అమ్మాయిని ప్రేమించి సాధారణంగా బ్రతుకుతున్న ప్రియదర్శి అనుకోని పరిస్థితుల్లో ఒక క్రైమ్ లో ఇరుక్కోవడం, ఆ తర్వాత అతని ఎదుర్కొన్న పరిస్థితులు, దాని నుండి ప్రియదర్శి ఎలా బయట పడ్డాడు అనేది సిరీస్ కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

ప్రియదర్శి తో పాటు బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. డబ్బు, ప్రేమ, లస్ట్, క్రైమ్ లాంటి అంశాల మీద సిరీస్ తీసినట్టు చూపించారు. రజిని కాంత్ తో బాషా లాంటి సినిమాని రూపొందించిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ‘సురేష్ కృష్ణ’ నిర్మాణంలో ఈ సిరీస్ రూపొందింది. విద్యా సాగర్ ముత్తుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ జూన్ 18 నుండి ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular