fbpx
HomeNationalమహారాష్ట్రలో చిన్న విమానం కూలిపోవడంతో 1 పైలట్ మృతి

మహారాష్ట్రలో చిన్న విమానం కూలిపోవడంతో 1 పైలట్ మృతి

PILOT-DEAD-IN-PLANE-CRASH-IN-MAHARASHTRA

జల్గావ్: మహారాష్ట్రలోని జల్గావ్‌లో శుక్రవారం ఒక చిన్న విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ దురదృష్టవశాత్తు మృతి చెందగా, అందులో ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలయ్యాయి.

కాగా ఈ విమానం ఒక ఫ్లయింగ్ పాఠశాలకు చెందినది అని పోలీసులు తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఈ విమానం ప్రమాదంలో కూలిపోవడంతో మహిళ పైలట్‌తో సహా ఇద్దరు పైలట్లు విమానంలో ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన మహిళా పైలట్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ చిన్న విమాన ప్రమాదం సత్పురా పర్వత శ్రేణులలో భాగమైన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని చోప్డా ప్రాంతంలోని వార్డి గ్రామ సమీపంలో జరిగింది అని ఒక సంబంధిత అధికారి వార్తా సంస్థ పిటిఐ కు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular