టాలీవుడ్: టాలీవుడ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో మొదటి స్థానంలో ఉండే సినిమా ‘RRR ‘. బాహుబలి లాంటి సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్ఠీఆర్ మరియు రామ్ చరణ్ నటిస్తుండడం తో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. వీటితో పాటు ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న అల్లురి సీతా రామరాజు మరియు ఎన్ఠీఆర్ నటిస్తున్న కొమురం భీం కారెక్టర్లకి సంబందించిన టీజర్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండడం తో ఈ సినిమాపై అన్ని చోట్ల ఆసక్తి నెలకొంది.
కరోనా గానే లేకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ కరోనా తర్వాత డే & నైట్ షూట్ చేసి టీం అంతా కష్టపడి ఈ సినిమా షూటింగ్ త్వర త్వరగా పూర్తి చేసే స్థాయికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే ఈరోజు క్లైమాక్స్ షూటింగ్ మొదలు పెట్టినట్టు ఎస్.ఎస్. రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. సీతారామరాజు మరియు కొమురం భీం వాళ్ళు సాధించాలన్న దానికోసం చేతులుకలిపారు అని ఒక పోస్ట్ పెట్టి ఒక ఫోటో కూడా జత చేసాడు . షూటింగ్ త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి జూన్ లేదా జులై లో ఈ సినిమా విడుదల చేయాలనీ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.