fbpx
Monday, January 24, 2022

INDIA COVID-19 Statistics

39,543,328
Confirmed Cases
Updated on January 24, 2022 11:11 pm
489,896
Deaths
Updated on January 24, 2022 11:11 pm
2,249,287
ACTIVE CASES
Updated on January 24, 2022 11:11 pm
36,804,145
Recovered
Updated on January 24, 2022 11:11 pm
HomeLife Styleనీతా అంబానీకి అరుదైన గౌరవం, పవర్ ఫుల్ సెకండ్‌ ప్లేస్‌లో!

నీతా అంబానీకి అరుదైన గౌరవం, పవర్ ఫుల్ సెకండ్‌ ప్లేస్‌లో!

NITAAMBANI-SECOND-POWERFUL-WOMEN-IN-FORTUNE-MAGAZINE

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్ నీతా అంబానీ తన వ్యాపార రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. దేశంలో ఇంతకు ముందు అమలులో ఉన్న లాక్‌ డౌన్‌ టైమ్‌లో కరోనా బాధితులకు ఆమె ఉచితంగా అందించిన సేవలకు గాను నీతా అంబానీకి అరుదైన గౌరవం లభించింది.

తాజాగా ఫార్చున్ మ్యాగజైన్ నుండి విడుదలైన ‘మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌’ జాబితాలో నీతా అంబానీ రెండో స్థానంలో చోటు దక్కించుకున్నారు. దేశంలో కరోనా రెండవ వేవ్ సమయంలో ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర‍్పడిన సంగతి అందరికీ తెలిసిందే.

కాగా ఆ సమయంలో బెడ్ల కొరత లేకుండా కోవిడ్‌ బాధితులకు నీతా అంబానీ అండగా నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి ముంబైలో తొలిసారి 250 పడకల కోవిడ్‌ వార్డ్‌ను ఏర్పాటు చేయించి ట్రీట్మెంట్‌ ను ప్రారంభించారు.

కాగా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా 2,000 పడకలకు పెంచి ఉచితంగా ట్రీట్మెంట్‌ అందించేలా చేశారు నీతా అంబానీ. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి రోజూ 15,000 కంటే ఎక్కువగా కోవిడ్-19 టెస‍్టులు నిర్వహించేలా టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు ప్రతిరోజూ లక్ష పీపీఈ కిట్లతో పాటు ఎన్‌-95 మాస్క్‌లను అందించారు.

రిలయన్స్‌ ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్న నీతా అంబానీ జియో హెల్త్‌ హబ్‌ సాయంతో ఇప్పటివరకు దేశంలో 25 లక్షల మంది వరకు కోవిడ్‌ టీకాలు అందేలా సహాయం చేశారు. 100 జిల్లాలు, 19 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు, రోజూవారీ కూలీలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా 8.5 కోట్లకు పైగా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించి మానవత్వం చాటుకున్నారు.

అయితే మహమ్మారి విలయం తాండవం చేస్తున్న సమయంలో బాధితులకు అండగా నిలిచినందుకు గాను ఫార్చున్‌ మ్యాగజైన్‌ దేశంలోనే ‘మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌’ జాబితాలో నీతా అంబానిని ఎంపిక చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular