fbpx
Tuesday, January 25, 2022

INDIA COVID-19 Statistics

39,543,328
Confirmed Cases
Updated on January 25, 2022 12:11 am
489,896
Deaths
Updated on January 25, 2022 12:11 am
2,249,287
ACTIVE CASES
Updated on January 25, 2022 12:11 am
36,804,145
Recovered
Updated on January 25, 2022 12:11 am
HomeTelanganaతెలంగాణ ఆర్టీసీ టికెట్ల చార్జీలు మరోసారి పెంపు!

తెలంగాణ ఆర్టీసీ టికెట్ల చార్జీలు మరోసారి పెంపు!

TSRTC-HIKES-BUS-TICKETS-ONCE-AGAIN

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంకో సారి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం. కాగా ఎప్పటి నుంచో ఈ ఛార్జీల పెంపు విషయం పై సాగుతున్న చర్చ తాజాగా ఒక కొలక్కి వచ్చింది. అయితే ఒక వైపు కరోనా, మరోమైపు డీజిల్‌ ధరలు పెరగడంతో బస్సు చార్జీలను పెంచడం తప్పదు అనే నిర్ణయానికి వచ్చినట్లుంది టీఎస్సార్టీసీ.

ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుకు సంబంధించిన ఫైల్‌ ఈ పాటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు చేరింది. బస్సు చార్జీల పెంపు ప్రతిపాదనను ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం‌ త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఈ పెంపు ఆర్డినరీ బస్సులో ఒక కిలోమీటర్‌కు 20 పైసలు, పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసలు, ఇక మిగతా బస్సుల్లో 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్‌ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రజారవాణా సంస్థ పై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడిందని ఆయన అన్నారు.

రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular