fbpx
HomeMovie News'అమ్మోరు తల్లి' గా నయనతార

‘అమ్మోరు తల్లి’ గా నయనతార

Nayanatara AmmoruThalli TrailerReleased

కోలీవుడ్: తమిళ్ లో ‘మూకుత్తి అమ్మన్’ గా రూపొంది తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో వస్తున్న సినిమా ‘అమ్మోరు తల్లి’. ఇందులో తమిళ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ‘ముక్కు పుడక అమ్మ వారు‘ అనే దేవత రూపం లో నటిస్తుంది. ఈ సినిమాని దీపావళి సందర్బంగా నవంబర్ 14 న డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. దసరా నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. తమిళ కామెడీ ఆక్టర్ ఆర్ జె బాలాజీ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తెలుగులో మహేష్ బాబు విడుదల చేసాడు. ట్రైలర్ ఆద్యంతం కామెడీ తో పాటు చివర్లో ఒక సోషల్ మెసేజ్ తో ఉన్నట్టు అనిపించింది. ఒక ఇంటి కుల దైవం అయిన ముక్కు పుడక అమ్మవారు వాల్లకి స్వయంగా సాక్షాత్కారం అయ్యి తాను దేవత అని నిరూపించుకొని వాల్ల కోరికలు తీరుస్తూ తన రావడానికి గల ముఖ్య ఉదేశ్యాన్ని నెరవేర్చుకోవడమే కథ.

ఇప్పుడున్న సమాజంలో భక్తి , దైవత్వం ఎలా మారుతోంది.. దాని వలన ఎవరు లాభపడుతున్నారు.. జనాల భక్తిని ఆసరాగా తీసుకొని మోసాలు ఎలా జరుగుతున్నాయి అనేది కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ‘దేవుడిని నమ్మని వాడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఒక్క దేవుడే ఉన్నాడు మరో దేవుడు నిజం కాదు అంటూ’ అనే మాటలు ఆకట్టుకున్నాయి. రెగ్యులర్ గ వచ్చే దేవతల రివెంజ్ సినిమా కథలు కాకుండా అలాని కామెడీ పేరుతో రకరాకాలుగా సినిమా తియ్యకుండా హ్యూమర్ ని మెసేజ్ ని జోడించిన కథగా ఉండబోతుంది అని అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular